వేధింపులపై ఆరోపిస్తూ కార్మికులు దౌత్యకార్యాలయంకు పిర్యాదు
- July 25, 2016
మనామా: దాదాపు 80 మంది కార్మికులు సోమవారం ఉదయం భారత రాయబార కార్యాలయానికి నేరుగా పిర్యాదు చేయడానికి వెళ్ళారు. తమను ఈ దేశంకు తీసుకొని వచ్చిన ప్రాయోజికుడు ఎటువంటి సదుపాయాలు అందివ్వకుండా బయటకు గెంటివేశాడని ఆరోపించారు. ఆ వ్యక్తి తమను రోజుకు 12 గంటలకు పైగా పని చేస్తున్నాడని , ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తున్నట్లు తెలిపారు.
వేసవి పని నిషేధం ఉన్న విరామ గంటల సమయంలో కూడా పని చేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని, దీనితో తాము మండు వేసవికాలంలో పని చేస్తున్నట్లు రాయబార అధికారులకు వివరించారు..ఆదివారం సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో సైతం వారు అసాధారణంగా పని చేయించడంతో ఫిర్యాదు చేసేందుకు తమ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ వారిని వసతి గృహం లోనికి వెళ్లేందుకు ప్రాయోజికుడు అనుమతించలేదు.
పురుషులు కూడా వారు కేవలం చమురు ట్యాంకర్లు నిర్వహణ చేసే భారీ పనికిగాను జీతం గా బీడీ 70 లను ఇస్తున్నారని ఆహారం కోసం మరొక బి డి 10 ఇవ్వటం లేదని ఆరోపించారు. అయితే వారు తమ జీతాలకు సంబంధించిన ఫిర్యాదులు మినహా మరే ఇతర ఆరోపణలు చేయలేదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాలలో పని చేయడం మనిషికి అసాధ్యం అని కార్మికులు పేర్కొంటున్నారు. ఆ లోపలి ప్రదేశాలు ఎంతో ఎండతో మండిపోతుంటాయనీ ఎయిర్ కండిషన్డ్ ఉన్నా ఆ ప్రాంతాన్ని మార్చలేవని కార్మికులు వాపోయారు. కార్మికుల ఫిర్యాదులకు స్పందించిన రాయబార కార్యాలయ అధికారులు వీటి గూర్చి తాము పరిశీలిస్తామని వాగ్దానం చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







