పులి రూపంలో వచ్చిన మృత్యువు
- July 25, 2016
సరదాగా కుటుంబంతో జూకు వెళ్లిన ఓ మహిళను పులి రూపంలో వచ్చిన మృత్యువు కబళించి వేసింది. చైనాలోని బీజింగ్‌లో ఉన్న జంతు ప్రదర్శనశాలకు ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. పులుల ఎన్‌క్లోజర్‌లోకి కారు అనుమతి ఉండటంతో అందరూ అందులో లోపలికి వెళ్లారు. కాగా అదే సమయంలో వారి మద్య ఏదో వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఓ మహిళ కారు దిగి మరో పక్కకి వచ్చి తలుపు దగ్గర నిలబడి కారులోని వాళ్లతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన పెద్దపులి అమాంతం ఆ మహిళను నోట కరచుకుని ఈడ్చుకుపోయింది. ఆమెను కాపాడేందుకు కారులో ఉన్న మరో మహిళ, ఓ యువకుడు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో ఇద్దరు పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కారులో పిల్లలు కూడా ఉన్నారని వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మహిళను పులి ఈడ్చుకుపోయిన దృశ్యాలు జూలోని సీసీటీవీ కెమేరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







