పులి రూపంలో వచ్చిన మృత్యువు

- July 25, 2016 , by Maagulf
పులి రూపంలో వచ్చిన మృత్యువు

సరదాగా కుటుంబంతో జూకు వెళ్లిన ఓ మహిళను పులి రూపంలో వచ్చిన మృత్యువు కబళించి వేసింది. చైనాలోని బీజింగ్‌లో ఉన్న జంతు ప్రదర్శనశాలకు ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. పులుల ఎన్‌క్లోజర్‌లోకి కారు అనుమతి ఉండటంతో అందరూ అందులో లోపలికి వెళ్లారు. కాగా అదే సమయంలో వారి మద్య ఏదో వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఓ మహిళ కారు దిగి మరో పక్కకి వచ్చి తలుపు దగ్గర నిలబడి కారులోని వాళ్లతో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన పెద్దపులి అమాంతం ఆ మహిళను నోట కరచుకుని ఈడ్చుకుపోయింది. ఆమెను కాపాడేందుకు కారులో ఉన్న మరో మహిళ, ఓ యువకుడు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, మరో ఇద్దరు పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కారులో పిల్లలు కూడా ఉన్నారని వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మహిళను పులి ఈడ్చుకుపోయిన దృశ్యాలు జూలోని సీసీటీవీ కెమేరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com