అఖండ 2 ట్రైలర్ వచ్చేసింది..
- November 22, 2025
నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ-2. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది.
‘ఇప్పటి వరకూ ప్రపంచపటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవు’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ ఫుల్ డైలాగులు, విజువల్స్ సూపర్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బెంగళూరులో గ్రాండ్ గా నిర్వహించారు. శివ రాజ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సనాతన ధర్మం ప్రధాన అంశంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో బాలయ్య మూడు గెటప్స్ లో (వృద్ధ అఘోరా, యువ అఘోరా, యువ వ్యాపారవేత్తగా) కనిపించారు. థమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న ప్రపచంవ్యాప్తంగా విడుదల కానుంది. అఖండకు స్వీకెల్ గా ఈ సినిమా వస్తోంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







