ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- November 22, 2025
మస్కట్: మస్కట్ మరియు నార్త్ అల్ బటినా గవర్నరేట్‌లలో పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడిన పలువురిని ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, సీబ్‌లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్‌తో సమన్వయంతో ఏడుగురు ముసుగు ధరించిన ఒమన్ జాతీయులను అరెస్టు చేశారు. ఈ వ్యక్తులు సీబ్‌లోని విలాయత్‌లో పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ సృష్టించడంతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పోలీసులు తెలిపారు.
మరో సంఘటనలో నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సోహార్‌లోని విలాయత్‌లో ముసుగు ధరించిన పలువురిని అదుపులోకి తీసుకుంది. వీళ్ల దాడిలో ఒక వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అల్లర్లను ప్రేరేపించడం, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం వంటి ఆరోపణల కింద కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రాపిడో ఫుడ్ డెలివరీ.. ‘ఓన్లీ’ యాప్ ప్రారంభం
- కాంగోలో కుప్పకూలిన విమానం..14 మంది మృతి
- బహ్రెయిన్ చారిత్రక ప్రాంతాల పునరుద్ధరణకు చర్యలు..!!
- ఖతార్‌లో తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు.. వాటర్ లైన్ నిర్వహణ పనులు..!!
- లండన్‌లో ‘లివ్ ఒమన్’ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాకు రక్షణగా..మక్కా ఒప్పందం అమలుపై కీలక నిర్ణయం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు..!!
- దుబాయ్‌లో అనధికార ఆక్యుపెన్సీపై కఠిన చర్యలు..!!
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి







