TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

- November 24, 2025 , by Maagulf
TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9న రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సమ్మిట్కు సంబంధించిన లోగోను అధికారులు తాజాగా విడుదల చేశారు. తొలి రోజు ప్రభుత్వ పథకాల ప్రదర్శన, రెండో రోజు 'తెలంగాణ రైజింగ్ 2047′ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండనుంది. ఈ కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన అంబాసిడర్లు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com