FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- November 24, 2025
దోహా: అరాంకో సమర్పిస్తున్న FIFA ఇంటర్కాంటినెంటల్ కప్ ఖతార్ 2025 టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సాధరణ టిక్కెట్ ధర QR 20 నుండి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 10, 13 మరియు 17 తేదీల్లో FIFA ఇంటర్కాంటినెంటల్ కప్ చివరి మూడు మ్యాచ్‌లను అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అభిమానులు మూడు విభాగాలలో మూడు మ్యాచ్‌లకు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి గరిష్టంగా 6 టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు.
డిసెంబర్ 10, రాత్రి 8 గంటలకు FIFA డెర్బీ ఆఫ్ ది అమెరికాస్ ఖతార్ 2025 కోసం మెక్సికో కు చెందిన క్రజ్ అజుల్, CONMEBOL లిబర్టడోర్స్ 2025 విజేతతో తలపడనుంది.
డిసెంబర్ 13, రాత్రి 8 గంటలకు FIFA ఛాలెంజర్ కప్ ఖతార్ 2025 కోసం ఫిఫా డెర్బీ ఆఫ్ ది అమెరికాస్ ఖతార్ 2025 విజేత టీమ్, ఈజిప్ట్ కు చెందిన పిరమిడ్స్ FC తో తలపడనుంది.
డిసెంబర్ 17, రాత్రి 8 గంటలకు ఫిఫా ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫైనల్ కోసం ఫ్రాన్స్ కు చెందిన పారిస్ సెయింట్-జర్మన్ టీమ్, FIFA ఛాలెంజర్ కప్ ఖతార్ 2025 విజేతతో తలపడనుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్







