BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- November 26, 2025
మనామా: బహ్రెయిన్ రాజ్యం గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కు అవసరమైన కనీస రియల్ ఎస్టేట్ పెట్టుబడిని BD 200,000 నుండి BD 130,000 కు తగ్గించింది. ఈ చర్య హై-ఎండ్ ఆస్తులకు డిమాండ్‌ను పెంచుతుందని, దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఎక్కువ మంది విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు.
గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ దీర్ఘకాలిక రెసిడెన్సీ స్కీమ్. పెట్టుబడి పరిమితిని తగ్గించడం ద్వారా, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిని ప్రోత్సాహించాలని బహ్రెయిన్ భావిస్తోంది. ముఖ్యంగా బహ్రెయిన్ లోని తీరప్రాంతంలో రెసిడెన్సీ ప్లాట్లకు డిమాండ్ అధికంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
2024లో నమోదైన అమ్మకాలలో విల్లాలు మరియు ల్యాండ్డ్ ఇళ్ళు 70.11% వాటాను కలిగి ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు సౌకర్యాలతో కూడిన రెడీ-టు-లివ్ యూనిట్ల వైపు ఆకర్షితులవుతారని తెలిపారు. యూరోపియన్ మరియు ఆసియా పెట్టుబడిదారులు బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నారని రియల్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం







