సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!

- November 26, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ అమల్లోకి రానుంది. తీపి బెవరెజేస్ పై ఎంపిక చేసిన ట్యాక్స్ ను విధించనున్నారు.ఈ మేరకు పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్ ప్రకటించారు.బెవరెజేస్ పై స్వీట్నర్ ట్యాక్స్ విధించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సహా వివిధ సంస్థలు కోరాయని అల్ఖోరాయెఫ్ స్పష్టం చేశారు.

ప్రజారోగ్యాన్ని కాపాడటం మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించడం న్యూ ట్యాక్స్ పాలసీ లక్ష్యమని ఆయన తెలిపారు.  అదే సమయంలో పరిశ్రమ ఉత్పత్తులను ఆవిష్కరించడానికి మరియు అభివృద్ధి చేయడానికి కూడా వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఆర్థిక సహకార కమిటీ గత నెలలో స్వీట్ బెవరేజస్ పై ఎంపిక చేసిన ట్యాక్సును లెక్కించే పద్ధతిని సవరించడానికి ఉద్దేశించిన ఒక నిర్ణయాన్ని ఆమోదించింది. కొత్త టైర్డ్ వాల్యూమెట్రిక్ విధానం ప్రకారం, ప్రతి 100 మిల్లీలీటర్ల రెడీ-టు-డ్రింక్ స్వీటెన్డ్ బెవరేజస్ కు మొత్తం చక్కెర ద్వారా నిర్ణయించబడిన గ్రేడెడ్ బ్యాండ్‌ల ప్రకారం ట్యాక్సును నిర్ణయించి విధిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com