కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!

- November 27, 2025 , by Maagulf
కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అత్యవసర బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. తాజాగ హవల్లి గవర్నరేట్‌లో నిర్వహించిన తనిఖీలలో వేలాది నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

అసలైన ట్రేడ్‌మార్క్‌లను కలిగి ఉన్న నకిలీ వస్తువులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని వాణిజ్య నియంత్రణ విభాగం డైరెక్టర్ ఫైసల్ అల్-అన్సారీ తెలిపారు. పలు దుకాణాల నంచి 3,602 నకిలీ వస్తువులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో మహిళల దుస్తులు, బ్యాగులు, బూట్లు మరియు ఉపకరణాలు ఉన్నాయని అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

మార్కెట్లు, నిర్వహణ వర్క్‌షాప్‌లు మరియు కార్ షోరూమ్‌లలో తనిఖీ బృందాలు తమ క్షేత్ర ప్రచారాలను కొనసాగిస్తాయని అల్-అన్సారీ తెలిపారు.  అన్ని వాణిజ్య కార్యకలాపాలు చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని సూచించారు. లేదంటే,  దుకాణాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com