TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- November 28, 2025
హైదరాబాద్: డాక్టర్ కరిష్ని చిత్తర్వు అరుదైన గౌరవాన్ని పొందారు.వైద్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలను గుర్తించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ,డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వును నియమించారు.ఆమె టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ తరఫున సేవలు అందించనున్నారు.ఈ మేరకు డాక్టర్స్ సెల్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ ఉత్తర్వులను జారీ చేశారు.టీపీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ రంగంలో పనిచేస్తూ..పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.పబ్లిక్ హెల్త్ సంబంధించి తనదైన రీతిలో మెరుగైన సేవలు అందించాలని ఉత్తర్వుల్లో కోరారు.డాక్టర్ కరిష్ని నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







