A320 విమానాలపై సౌదీయా రివ్యూ..!!
- November 29, 2025
రియాద్: సౌదీయా తన ఎయిర్‌బస్ A320 విమానాలను సమీక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బస్ తయారీ సంస్థ అలెర్ట్ జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న A320 విమానాల్లో సగానికి పైగా విమానాలను రీకాల్ ప్రభావితం చేస్తుందని తెలిపింది.
విమాన షెడ్యూల్‌లపై ప్రస్తుతం ప్రభావం లేదని, ఒక వేళ అప్డేట్ ఉంటే నేరుగా ప్రయాణికులు అలెర్ట్ చేస్తామని ఎయిర్‌లైన్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ప్రయాణికులు తమ కాంటాక్ట్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని, నోటిఫికేషన్‌లను నిరంతరం చెక్ చేసుకోవాలని సౌదీయా కోరింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని ఎయిర్‌లైన్ తెలిపింది.
ఈ శుక్రవారం ఎయిర్‌బస్ 6,000 A320-ఫ్యామిలీ జెట్‌లకు తక్షణ మరమ్మతులు తప్పనిసరి అని ప్రకటించిన తర్వాత సౌదీయా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎయిర్ బస్ కంపెనీ 55 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద రీకాల్‌లలో ఇది ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ బస్ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా 350 కంటే ఎక్కువ మంది ఆపరేటర్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేల A320 విమానాలు వివిధ విమానయాన సంస్థల తరఫున సేవలు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







