హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ పై దర్యాప్తు ప్రారంభం..!!
- November 30, 2025
కువైట్: హ్యూమన్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించిన అనేక కేసులపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ మేరకు కువైట్ అటార్నీ జనరల్ కౌన్సెలర్ సాద్ అల్-సఫ్రాన్ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
కార్మికులను అక్రమంగా తీసుకొచ్చి వారిపై శ్రమ దోపిడికి పాల్పడుతున్న తొమ్మిది కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి పద్ధతులు మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై 2013 చట్టం నంబర్ 91 ద్వారా నిషేధించిన చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇప్పటివరకు 115 మంది బాధితులను రక్షించామని, 48 మంది అనుమానితులను విచారించామని, దర్యాప్తు కొనసాగుతున్నాయని ప్రాసిక్యూషన్ వివరించింది.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







