సలాం ఎయిర్ విమాన సర్వీసులకు అంతరాయం..!!
- November 30, 2025
మస్కట్: విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలకు కొత్త సాంకేతిక మార్గదర్శకాలను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో A320 ఫ్యామిలీ ఆఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలను విమానయాన సంస్థలు పాటిస్తున్నాయి.
తాజా ఎయిర్ బస్ గైడ్ లైన్స్ నేపథ్యంలో సలాంఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత తమ ప్రధాన ప్రాధాన్యతగా ఉంటుందన్నారు. తాము అవసరమైన చర్యలను అమలు చేస్తున్నామని, త్వరలోనే ఆపరేషన్ కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
అయితే, కొన్ని విమాన సర్వీసులకు అంతరాయం కలగవచ్చని పేర్కొంది. ఒక వేళ సర్వీసులకు అంతరాయం కలిగితే, నేరుగా ప్రయాణికులకు అలెర్ట్ పంపుతామని తెలిపింది. తమ బృందాలు 24 గంటలు పనిచేస్తున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







