ఢిల్లీలో అగ్నిప్రమాదం..
- November 30, 2025
న్యూ ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భయంకర అగ్ని ప్రమాదం జరిగింది.ఒక బూట్ల దుకాణంలో మంటలు చెలరేగి, అన్నాచెల్లెలు సహా నాలుగుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మంటలకు కారణాలు నిర్ధారించేందుకు
పోలీసుల వివరాల ప్రకారం, నాలుగంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బూట్ల దుకాణంలో సాయంత్రం 6:24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరినప్పటికీ, మంటలు వేగంగా పై అంతస్తుల వైపు వ్యాపించాయి.
ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలను ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.మృతులను భవన యజమాని సతేందర్ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు.గాయపడిన మమత (40) 25 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.పోలీసుల క్రైమ్, ఫోరెన్సిక్ బృందాలు మంటలకు కారణాలు నిర్ధారించేందుకు ఘటనా స్థలంలో పరిశీలనలు కొనసాగిస్తున్నాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







