‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!

- December 01, 2025 , by Maagulf
‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!

రియాద్: సౌదీ అరేబియా ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2026, నవంబర్ 9 నుండి 12వ తేదీ వరకు రియాద్‌లో జరగనున్న 6వ UN వరల్డ్ డేటా ఫోరమ్‌ సన్నాహాల్లో భాగంగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) “రోడ్ టు రియాద్” కార్యక్రమాన్ని ప్రారంభించింది.

వరల్డ్ స్టాటిస్టిక్స్ దినోత్సవంతో సమానంగా, అక్టోబర్ 20న జెడ్డాలో యూనివర్సిటీలు మరియు స్టాటిస్టిక్స్ అసోసియేషన్స్ కోసం రెండవ స్టాటిస్టిక్స్ ఫోరమ్ సందర్భంగా  ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రపంచ డేటా మరియు గణాంకాలలో సౌదీ అరేబియా పెరుగుతున్న పాత్రను హైలైట్ చేయనున్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన నిపుణులు పాల్డొని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని వివరించనున్నారు.  

ఏడాది పాటు జరిగే “రోడ్ టు రియాద్”లో వర్చువల్ ఈవెంట్‌లు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు మరియు ప్రత్యేక సెషన్‌లు ఉంటాయి.  GASTAT దాని అధికారిక వెబ్‌సైట్‌లో “రోడ్ టు రియాద్” ఈవెంట్‌ల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com