మనామాలో 46వ GCC సమ్మిట్..!!

- December 02, 2025 , by Maagulf
మనామాలో 46వ GCC సమ్మిట్..!!

మనామా: బహ్రెయిన్ రాజధాని మనామాలో జరగనున్న నలభై ఆరవ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సమ్మిట్ కోసం ఏర్పాట్లు పూర్తి అయినట్లు ప్రకటించారు. దేశాల మధ్య అన్ని స్థాయిలలో  సహకారం, సమగ్ర సమైక్యత మరియు బంధాల బలోపేతానికి ఈ సమావేశం ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ఈ కీలకమైన సమావేశంలో పాల్గొనే ఒమన్ సుల్తానేట్ ప్రతినిధి బృందానికి హిజ్ మెజెస్టీస్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వం వహిస్తున్నారు.  

ఈ శిఖరాగ్ర సమావేశంలో అన్ని రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా రంగాలలో ఉమ్మడి గల్ఫ్ సహకార ప్రయాణంపై సమీక్ష ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ మరియు ప్రాంతీయ పరిణామాలు, ప్రాంతీయ భద్రత వాటి ప్రభావాలపై చర్చించనున్నట్లు GCC సెక్రటరీ జనరల్ జాస్సేమ్ మొహమ్మద్ అల్ బుదైవి తెలిపారు. బహ్రెయిన్ సమ్మిట్ నిర్మాణాత్మక తీర్మానాలు మరియు సిఫార్సులను అందిస్తుందని అన్నారు.డిసెంబర్ 2024లో కువైట్ లో నలభై ఐదవ గల్ఫ్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా అనేక కీలక రంగాలపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com