బహ్రెయిన్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం..!!
- December 02, 2025
మనామా: బహ్రెయిన్ లో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మద్దతుతో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. హీజ్ మెజెస్టి ది కింగ్ భార్య మరియు సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ చైర్‌వుమన్ అయిన హర్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ సబికా బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫా మాట్లాడుతూ.. బహ్రెయిన్ మహిళలు ముందుకు సాగడానికి మరియు నాయకత్వ బాధ్యతలను సాధించడానికి సహాయపడిన కింగ్ మరియు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
“బహ్రెయిన్ మహిళలు… సృజనాత్మకత, ఆవిష్కరణ” అనే థీమ్‌తో జరిగిన 2025 బహ్రెయిన్ మహిళా దినోత్సవ వేడుకలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమాలు బహ్రెయిన్ తన పౌరులపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయని మరియు దేశం పట్ల నిబద్ధత, ప్రేమను పునరుద్ఘాటిస్తాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అవార్డులతో సహా బహ్రెయిన్ మహిళలు సాధించిన విజయాలను ప్రిన్సెస్ సబికా హైలైట్ చేశారు. అనంతరం వివిధ రంగాలలో బహ్రెయిన్ మహిళలు సాధించిన విజయం, ఆవిష్కరణలు తెలిపేలా లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అవార్డులు పొందిన అనేక మంది బహ్రెయిన్ మహిళలను సత్కరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







