ఇంటర్-స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్‌ విజేతలు వీరే..!!

- December 02, 2025 , by Maagulf
ఇంటర్-స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్‌ విజేతలు వీరే..!!

కువైట్: కువైట్ లోని FAIPS DPS ఆడిటోరియంలో ఇంటర్-స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్‌ ముగిసింది.ఇంటర్-స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్ ప్రతిభ, సృజనాత్మకత మరియు సాంస్కృతిక కలయిక ఉత్సాహభరితమైన ప్రదర్శనను అందించిందని వక్తలు ప్రశంసలు కురిపించారు. మొత్తం 15 భారతీయ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 26 జట్లు ఈ కాంపిటీషన్ లో పాల్గొని ప్రతిభ చూపారు.ఈ పోటీలో సబ్-జూనియర్, జూనియర్ మరియు సీనియర్ అనే మూడు విభాగాలు ఉన్నాయి.  

సబ్-జూనియర్ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కువైట్ సాధించగా, 2వ బహుమతిని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్-భవన్స్, 3వ బహుమతిని న్యూ గల్ఫ్ ఇండియన్ స్కూల్ సాధించాయి.ఇక జూనియర్ కేటగిరీలో 1వ బహుమతిని ఫెయిప్స్ డీపీఎస్, 2వ బహుమతిని ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్-భవన్స్, 3వ బహుమతిని ICSK - అమ్మన్ సాధించాయి. సీనియర్ కేటగిరీ విభాగంలో 1వ బహుమతిని ఫెయిప్స్ డీపీఎస్, 2వ బహుమతి ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్-భవన్స్, 3వ బహుమతిని ఐసీఎస్కే - అమ్మన్ సాంధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com