ఏపీ: నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు
- December 02, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కల్పించడానికి కౌశలం కార్యక్రమం చేపట్టింది.రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలలో విద్యార్హత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యం, వృత్తి నైపుణ్యతను అంచనా వేస్తారు.
పరీక్షలు ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు, మొత్తం 45 నిమిషాలపాటు నిర్వహించబడతాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సైకోమెట్రిక్ అసెస్మెంట్, వ్యక్తిగత మరియు సాంకేతిక ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఇంగ్లీషులో కొన్ని ప్రశ్నలకు 30 సెకన్లుగా జవాబు ఇచ్చి వెబ్ కెమెరాలో రికార్డ్ చేయించాలి.
పరీక్ష రాసే సమయంలో కెమెరా, మైక్రోఫోన్, ఫుల్ స్క్రీన్, లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. నియమాలు పాటించకపోతే అభ్యర్థి అర్హత కోల్పోతారు. ఈ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు స్థిరమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు, ఉపాధి మార్గాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
తాజా వార్తలు
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం









