దుబాయ్ పార్క్‌లు, మ్యూజియమ్‌లలో ఎన్‌ఓఎల్ కార్డులకు అనుమతి
- July 26, 2016
పార్క్‌లు, మ్యూజియంలలో ప్రవేశం కోసం ఎన్‌ఓఎల్ కార్డులను వినియోగించవచ్చని దుబాయ్ మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ఆ కార్డుల ద్వారా ప్రవేశ రుసుము చెల్లించవచ్చని అధికారుల వివరించారు. దుబాయ్‌లో మెట్రో సహా, బస్సులు, వాటర్ బస్సులు, ట్యాక్సీలపై (రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రెగ్యులేట్ చేస్తున్నవి) ప్రయాణం కోసం ఎన్‌ఓఎల్ కార్డుల్ని అమల్లోకి తెచ్చారు. వీటిని పార్కులు, మ్యూజియంలలోనూ వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానం ద్వారా పార్కుల్లో, మ్యూజియంలలో ప్రవేశం కోసం ప్రత్యేకంగా టిక్కెట్ తీసుకోవడం, రుసుము చెల్లించడం వంటి ఇబ్బందులు తొలగుతాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ ఎన్‌ఓఎల్ కార్డులను వినియోగించడం తేలిక, సౌకర్యవంతం కూడా అని ఎన్‌ఓఎల్ యూజర్స్ వెల్లడిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఐటీ డిపార్ట్మెంట్ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మునిసిపాలిటీ కాల్ సెంటర్ హాట్ లైన్ నంబర్‌కి ఆటోమేటిక్ రెస్పాన్స్ వచ్చేలా డెవలప్ చేస్తున్నారు. ఇ-సర్వీసులను మొబైల్ సర్వీసులుగా మార్చడం అనేది స్మార్ట్ నిర్ణయమనీ, రానున్న రోజుల్లో ఇంకా ఇంకా సాంకేతికపరమైన మార్పులను చూడవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







