భాజపా సభ్యులపై కేవీపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

- July 26, 2016 , by Maagulf
భాజపా సభ్యులపై  కేవీపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

భాజపా సభ్యులపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ప్రైవేటు బిల్లు చర్చకు రాకుండా భాజపా సభ్యులు అడ్డుకుంటున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని కేవీపీ నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఇటీవల కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా.. భాజపా సభ్యులు మరో అంశంపై చర్చకు డిమాండ్‌ చేయడంతో ప్రైవేటు బిల్లుపై చర్చ జరగలేదు. కేవీపీ ప్రైవేటు బిల్లుపై వచ్చేనెల 5న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com