అమెజాన్ తన వినియెగదారులకోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి
- July 26, 2016
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వినియెగదారులకోసం మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రాం ను మంగళవారం ప్రకటించింది. దేశంలో 100కు పైగా నగరాల్లో తన సేవలు అందిస్తున్న అమెజాన్ ప్రధాన సభ్యత్వం కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. రూ 499 వార్షిక చందాతో దీన్ని యూజర్లకు పరిచయం చేస్తోంది. నిర్దేశిత రూ.999 ఫీజులో 60రోజుల ప్రారంభ ఫ్రీ ఆఫర్ తో పాటు, రూ. 500 డిస్కౌంట్ ఇస్తోంది. దీని ద్వారా ఆర్డర్ చేసిన రెండు మూడురోజుల్లోనే ఆయా ఉత్పత్తులు వినియోగదారుల చెంత చేరనున్నాయి. అంతేకాదు ప్రైమ్ సభ్యులకు అదనంగా ప్రత్యేక అవకాశాలు,స్పెషల్ డీల్స్ ను అందించనున్నట్టు ఒక ప్రకనటలో తెలిపింది. మినిమం కొనుగోలు నిబంధన లేకుండా ఈ అవకాశాన్ని ప్రైమ్ మెంబర్స్ అన్ లిమిటెడ్ ఫాస్ట్ ఫ్రీ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇది తమ వ్యాపార వృద్ధి మరింత తోడ్పాటు అందిస్తుందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఫ్రీ సర్వీసుతోపాటు ప్రైమ్ డెలీవరీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. సభ్యత్వం పొందిన తమ ప్రధాన సభ్యులు 20 నగరాల్లో 10,000 పైగా ఉత్పత్తులపై రూ .50 పైగా రాయితీతో అదే రోజు, ఉదయం లేదా షెడ్యూల్ డెలివరీని ఎంచుకోవచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







