'ఆంధ్ర కింగ్ తాలూకా' కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది: హీరో రామ్
- December 02, 2025
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.
థాంక్ యూ మీట్ హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ...అందరికీ హాయ్.రివ్యూవర్స్ కి థాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. ఎక్కువ మంది జనాలు చూడాలనే మైండ్ సెట్ తోనే తీసాం. కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే మాకు ఆడియన్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు చేయనంతగా సినిమాని ప్రమోట్ చేశాం. ఎందుకంటే నాకు అంత పర్సనల్ కలెక్షన్ ఉంది, ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూసాం. కానీ స్టార్ అండ్ ఫ్యాన్ కు మధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది. ఇలాంటి ఎమోషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తెలుగు సినిమాకే సొంతం. ఒక సినిమా చేస్తున్నప్పుడు హిట్టా ఫ్లాపా అనేది అనే భయమేస్తుంది. కానీ ఈ సినిమా చేసినప్పుడు మాత్రం ఇది మంచి సినిమా అని వెంటనే తెలుసుకుంటారా కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలని అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మొదటి రోజే కొట్టేయాలనే ప్లానింగ్ లో లేము. ఫస్ట్ వీక్ స్లోగా ఉంటుంది, నెమ్మది నెమ్మదిగా పిక్ అప్ అవుతుందని నమ్మకంతో తీసిన సినిమా. ఈ సినిమాని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆడియన్స్ నుంచే రెస్పాన్స్ వస్తుంది. టిఎఫ్ఐ ఫెయిల్ అయ్యిందనే మాట కూడా వినిపిస్తుంది. కానీ నేను నమ్మేదేంటంటే టిఎఫ్ఐ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. మనం సినిమా లవర్స్ మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది. సినిమా పదిమంది చూస్తే 9 మందికి నచ్చింది. అన్ సీజన్ వల్ల పదిమంది చూశారు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అని నమ్ముతున్నా. 100 మంది చూస్తే 90మందికి నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం. నవంబర్ అయిపోయింది. ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా ఉద్దేశం. మరింత మంది వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఒక హానెస్ట్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది. వివేక్ మర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్ కరెంట్ గా అద్భుతమైన మెసేజ్ ఉంది మంచి స్ఫూర్తితో బయటికి వచ్చే కంటెంట్ ఉంది. పదిమందిలో తొమ్మిది మంది అది ఫీలయ్యారు. నాకు సినిమా గురించి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. చాలా మెసేజ్‌లు వచ్చాయి మహేష్ హానెస్ట్ ఫిలిం మేకర్. తెలుగు సినిమాకి మహేష్ లాంటి ఫిలిం మేకర్స్ కావాలి. భాగ్యశ్రీ గ్లామర్ గా కనిపిస్తూనే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చాలా సపోర్ట్ చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా మనసుకు చాలా దగ్గరైన సినిమా. సెకండ్ వీక్ అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా ఎక్కువ మంది సినిమా చూసి ఒక మంచి అనుభూతిని పొందుతారని నమ్మకం ఉంది. తెలుగు సినిమా లవర్స్ అందరు కూడా ఈ సినిమాకి వచ్చి ఈ ఎమోషన్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అద్భుతమైన సినిమా తీసిన మా టీమ్ అందరికీ థాంక్యూ. మహాలక్ష్మి క్యారెక్టర్ చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా గొప్ప రివ్యూలు ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మేము యుఎస్ థియేటర్స్ విజిట్ చేసాము. ప్రేక్షకుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. తప్పకుండా ఈ సినిమాని మరింత మంది చూస్తారని కోరుకుంటున్నాను.
మైత్రి ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఆంధ్ర కింగ్ తాలూకా అందరం కలిసి చాలా ప్రేమించి చేసిన సినిమా. మేము ఏదైతే ఆశించామో అన్ని మాకు వచ్చాయి. సినిమా గురించి మీడియా మిత్రులు చాలా అద్భుతంగా రాశారు. అయితే ప్రశంసలతో పోల్చుకుంటే కలెక్షన్స్ కాస్త తక్కువగానే ఉన్నాయి. అయితే నవంబర్ ఎండ్, అన్ సీజన్లో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మేము ముందుగా స్లోగా ఉంటుందని ఊహించాం. ముందే ప్రిపేర్ అయ్యాం. నెక్స్ట్ వీక్ అద్భుతమైన రన్ ఉటుందని నమ్ముతున్నాము. ఇక్కడి నుంచి సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయి. రేపటి నుంచి థియేటర్స్ విజిట్ చేస్తాం. అభిమానుల్ని కలుసుకుంటాం. వినూత్నంగా ఏదైనా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా సైడ్ నుంచి మా ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఇది చాలా మంచి సినిమా. అందరూ చూడాలని కోరుకుంటున్నాం. మంచి సినిమాని ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను. మా సైడ్ బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. మీడియా నుంచి కూడా కోపరేషన్ ఆశిస్తున్నాం. మా హీరో గారు, హీరోయిన్ భాగ్యశ్రీ గారు ఉపేంద్ర గారు అందరు కూడా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ గారు ఈ సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనకీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. ఇంత అద్భుతమైన మ్యూజిక్ వచ్చిందంటే రీజన్ ఆయనే. డైరెక్టర్ గారు కూడా అద్భుతమైన రైటింగ్ తో సినిమాని తీశారు. భాగ్యశ్రీ గ్లామర్ తో పాటు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఉన్న హీరోయిన్. ఈ సినిమాని మేము ఇంకా ముందు ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. ఇది ఒక మంచి సినిమా. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాకి నార్మల్ టికెట్ రేట్స్ వున్నాయి. అందరూ సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేయండి. థాంక్యూ.
డైరెక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాకి ప్రేక్షకుల నుంచి మీడియా నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లబోతోంది. రిలీజ్ తర్వాత రామ్ గారు భాగ్యశ్రీ గారిని కలిసాము. చాలా క్రేజీ మూమెంట్స్ ని మిస్ అయిన ఫీలింగ్. ఇక్కడి నుంచి సినిమా చాలా లాంగ్ వెళ్ళబోతుంది. అందరికీ థాంక్యు సో మచ్.
మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మర్విన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చింది.సినిమాకి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా మా మనసుకి ఎంతో దగ్గర అయింది.రామ్ తో కలిసి చేసిన జర్నీ చాలా స్పెషల్. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకి చాలా లాంగ్ రన్ ఉంటుంది. ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ థాంక్యు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







