హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- December 03, 2025
హైదరాబాద్: హైదరాబాద్-సైబరాబాద్‌ను అనుసంధానించేలా, ఔటర్ రింగ్‌రోడ్డుకు వాహనదారులు వేగంగా చేరుకునేలా కొత్త ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సమస్యలు మరింత తగ్గనున్నాయి.
ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాలని హెచ్ఎండీఏను తెలంగాణ సర్కారు ఆదేశించింది.
బంజారాహిల్స్ రోడ్డు నం.12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లే అవుట్ వరకు 10 కి.మీ మేర 6 లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మించే అవకాశం ఉంది. దీనిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. మెహదీపట్నం టు శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్‌ప్రెస్ వేలాగే ఇప్పుడు కొత్త దాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్‌లో పెరిగిన జనాభాకు తగ్గట్లుగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించారు. అయినప్పటికీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఐటీ కారిడార్ నుంచి సిటీ మధ్యలోకి వచ్చే రోడ్లు, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
దీంతో కొత్త ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఓఆర్ఆర్ నుంచి సిటీ మధ్యలోకి రాకపోకలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే వీలు ఇస్తుంది. 6-7 కి.మీ మేర 6 వరుసల స్టీల్ బ్రిడ్జి, పలు ప్రాంతాల్లో అండర్ పాస్‌లను నిర్మించాలని భావిస్తున్నారు.
దీంతో వాహనాలు ఆటంకాలు లేకుండా వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సర్వే బాధ్యతలను ప్రభుత్వం ఓ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఇప్పటికే ఆ సంస్థ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







