2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!

- December 04, 2025 , by Maagulf
2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!

రియాద్: 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్ అందుబాటులోకి రానుంది. దిరియా గేట్‌ను కిద్దియాతో అనుసంధానించే కొత్త మెట్రో ట్రాక్ ను ప్రారంభించనున్నారు. మెట్రో పొడిగింపు మరియు రియాద్ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అనేవి రియాద్ లో కొనసాగుతున్న అభివృద్ధికి మద్దతునిచ్చే ప్రణాళికలో భాగంగా అందుబాటులోకి తేనున్నారు.
ఈ ప్రాజెక్ట్ రియాద్ రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయనుందని అధికారులు వెల్లడించారు. అలాగే రియాద్ ఫుడ్ స్ట్రీట్, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రియాద్ ను పర్యాటక కేంద్రంగా గుర్తింపును బలోపేతం చేస్తుందని అన్నారు.
వీటితో పాటు మెయిన్ మరియు రింగ్ రోడ్స్ యాక్సెస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, నగర నెట్‌వర్క్‌లోని 500 కిలోమీటర్లకు పైగా ఉన్న కారిడార్‌లను మెరుగుపరిచి, ప్రధాన కొత్త మార్గాల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళుతుందని ప్రకటించారు. గ్రీన్ రియాద్ కార్యక్రమంలో భాగంగా పార్కులు, వీధులు, పబ్లిక్ ప్రదేశాలలో సుమారు 7.5 మిలియన్ల కొత్త చెట్లను నాటనున్నారు. ఈ ప్రాజెక్టు తలసరి గ్రీనరీని ప్రస్తుతం ఉన్న 1.7 చదరపు మీటర్ల నుండి 28 చదరపు మీటర్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com