భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- December 04, 2025
యూఏఈ: యూఏఈ దిర్హామ్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో పడిపోయింది. దీంతో ఎమిరేట్స్‌లోని చాలా మంది భారతీయ నివాసితులు ఇంటికి డబ్బు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు.
1 దిర్హామ్‌కు రూపాయి మారకం రేటు దాదాపు రూ.24.5కి చేరుకోవడంతో, తమకు ఎక్కువ భారతీయ కరెన్సీ లభించిందని, దీని వలన పాఠశాల ఫీజులు, ఇతర ఖర్చులకు సహాయపడిందని పలువురు యూఏఈ నివాసితులు తెలిపారు. మరోవైపు నివాసితులు మారకపు రేటును సద్వినియోగం చేసుకోవడంతో చెల్లింపులు పెరిగాయని సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.
షార్జా నివాసి అయిన ఆరిఫ్ ఖాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అతను సాధారణంగా లక్నోలోని తన కుటుంబానికి ప్రతి నెలా దిర్హామ్‌లు 1,200 నుండి 1,500 వరకు పంపుతాడు. కానీ ఈసారి ఎక్కువ మొత్తాన్ని పంపినట్టు తెలిపాడు.
దుబాయ్ నివాసి మరియు FMGC సంస్థలో మార్కెటింగ్ హెడ్ అయిన ఆంథోనీ వర్గీస్ మాట్లాడుతూ, మారకం రేటులో ఎంత తేడా వచ్చిందో చూసి తాను ఆశ్చర్యపోయానని, అది క్రిస్మస్ బహుమతి లాంటిదని అన్నారు. తాను సాధారణంగా ప్రతి నెలా Dh2,000 పంపుతానని, ఈసారి Dh3,000 పంపినట్టు పేర్కొన్నాడు. గత నెల కంటే దాదాపు 8వేల రూపాయలు ఎక్కువ వచ్చిందని తెలిపాడు. ఆ అదనపు మొత్తం తన కుమార్తె స్కూల్ బస్సు మరియు ట్యూషన్ ఫీజు చెల్లించడానికి తమకు సహాయపడిందన్నారు.
తాజా వార్తలు
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్‌ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి







