అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు
- December 04, 2025
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే.
ఈ రోజు (డిసెంబర్ 4) భారత్‌లో జరగాల్సిన స్పెషల్ ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. “సాంకేతిక కారణాల వల్ల ఇండియాలో ఈ రోజు జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాము.
మా వంతు మేం ఎంతగానో ప్రయత్నించాం, కానీ కొన్ని అంశాలు మా నియంత్రణలో ఉండవు. అసౌకర్యానికి క్షమించండి” అని పోస్టులో పేర్కొంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ప్రీమియర్ షోలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే ప్రదర్శితమవుతాయని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- భారత్కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- సాహితీ లోకం ఆత్మీయురాలు సుధ ను కోల్పోయింది: నటుడు రాజేంద్ర ప్రసాద్
- నిజాం దర్బారుకు ప్రతీకగా హైదరాబాద్ హౌస్
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!







