క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!

- December 04, 2025 , by Maagulf
క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను భవిష్యత్ క్వాంటం ఎకానమీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బలమైన డిజిటల్ ఆధారాలు, నైపుణ్యవంతమైన ఐటీ వర్క్‌ఫోర్స్, గ్లోబల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఆర్‌అండ్‌డీ సెంటర్లు–ఇవన్నీ కలసి తెలంగాణను కొత్త తరం సాంకేతికతల హబ్‌గా నిలబెడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెక్యూరిటీ వంటి రంగాల్లో తెలంగాణ ముందుగానే దిశనిర్దేశం చేసుకోవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తోందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు క్వాంటం టెక్నాలజీల వైపు సాగుతున్న ఈ సమయంలో, పరిశోధన, ఇన్నోవేషన్, హైఎండ్ స్కిల్స్ అభివృద్ధికి అవసరమైన వాతావరణం రాష్ట్రంలో redanగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో హైదరాబాద్‌ను క్వాంటం ఎకానమీ లీడర్‌గా నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దేశంలో తొలి లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ రూపొందించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఈ వ్యూహంలో ప్రధానంగా మూడు కీలక అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో క్వాంటం పరిశోధన కోసం అధునాతన ల్యాబ్స్, స్టార్టప్ ఇంక్యుబేటర్లు, హార్డ్‌వేర్–సాఫ్ట్‌వేర్ టెస్ట్‌బెడ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పరిశోధకులకు గ్లోబల్ స్టాండర్డ్స్‌కి తగిన వనరులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలతో జోడీగా పనిచేస్తోంది.

క్వాంటం యుగంలో సెక్యూరిటీ ప్రధాన సవాలుగా మారనుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్వాంటం ఎన్క్రిప్షన్, సెక్యూర్ కమ్యూనికేషన్ టెక్నాలజీలపై ప్రత్యేక ప్రోగ్రాములు అమలులో పెట్టింది. ప్రభుత్వ డిజిటల్ వ్యవస్థలను కూడా క్రమంగా క్వాంటం రెడీ చేస్తోంది.

హైదరాబాద్ బయోటెక్, ఫార్మా రంగాల్లో ఉన్న ప్రపంచస్థాయి శక్తిని క్వాంటం కంప్యూటింగ్‌తో మేళవించి కొత్త ఆవిష్కరణలకు దారితీసే ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. డ్రగ్ డిస్కవరీ, జినోమిక్స్, ఆరోగ్య డేటా విశ్లేషణలో క్వాంటం టెక్నాలజీని వినియోగించేందుకు ప్రత్యేక ఆక్సిలరేషన్ ప్రోగ్రామ్‌లు రూపొందిస్తున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com