అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- December 05, 2025
దోహా: అరబ్ కప్ ఖతార్ 2025 సందర్భంగా షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. వర్కర్స్ సపోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఫండ్ మరియు కర్వా సంయుక్తంగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. అరబ్ కప్ ఖతార్ 2025 వేదికలైన ఆసియన్ టౌన్, బర్వా బరాహా మరియు క్రీక్ స్పోర్ట్స్ వేదికలకు మధ్యాహ్నం 3 గంటల నుండి ఉచిత షటిల్ బస్సులు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
టయోటా సిగ్నల్ ఎదురుగా ఉమ్ ఘువైలినా మరియు అల్ అస్మాఖ్ (బుఖారీ) మసీదు ఎదురుగా మరియు అల్ వతన్ సెంటర్ సమీపంలోని సలాహుద్దీన్ స్ట్రీట్ నుండి బస్సులు మధ్యాహ్నం 3 గంటల నుండి పికప్ సర్వీసులు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటల వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి. తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 5 మరియు డిసెంబర్ 11, 12 తేదీలలో అలాగే, డిసెంబర్ 18 ఖతార్ జాతీయ దినోత్సవం నాడు ఉచిత షటిల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







