అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!

- December 05, 2025 , by Maagulf
అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!

దోహా: అరబ్ కప్ ఖతార్ 2025 సందర్భంగా షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. వర్కర్స్ సపోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఫండ్ మరియు కర్వా సంయుక్తంగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు.  అరబ్ కప్ ఖతార్ 2025 వేదికలైన ఆసియన్ టౌన్, బర్వా బరాహా మరియు క్రీక్ స్పోర్ట్స్‌ వేదికలకు మధ్యాహ్నం 3 గంటల నుండి ఉచిత షటిల్ బస్సులు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు ప్రకటించారు.

టయోటా సిగ్నల్ ఎదురుగా ఉమ్ ఘువైలినా మరియు అల్ అస్మాఖ్ (బుఖారీ) మసీదు ఎదురుగా మరియు అల్ వతన్ సెంటర్ సమీపంలోని సలాహుద్దీన్ స్ట్రీట్ నుండి బస్సులు మధ్యాహ్నం 3 గంటల నుండి పికప్ సర్వీసులు ప్రారంభమవుతాయి.  సాయంత్రం 7 గంటల వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి. తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 5 మరియు డిసెంబర్ 11, 12 తేదీలలో అలాగే, డిసెంబర్ 18 ఖతార్ జాతీయ దినోత్సవం నాడు ఉచిత షటిల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com