సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- December 05, 2025
కువైట్: అల్-ఫర్వానియా గవర్నరేట్‌లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ముగ్గురు వ్యక్తులతో కూడిన క్రిమినల్ ముఠాను విజయవంతంగా పట్టుకుంది.ఇందులో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, ఇద్దరు అరబ్ జాతీయులు.అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసి, రెసిడెన్సీ ఆడ్రస్ లను చట్టవిరుద్ధంగా మార్చడానికి సివిల్ డేటాలో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుల ముఠా జలీబ్ అల్-షుయౌఖ్ మరియు ఫర్వానియా ప్రాంతాలలో ఆటోమేటెడ్ భవన సంఖ్యలను ఉపయోగించుకున్నారని, ప్రతి లావాదేవీకి KD 40 మరియు KD 120 మధ్య వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఠా కార్యకలాపాలను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద KD 1,694, ప్రింటర్, హార్డ్ డిస్క్, కెమెరా మరియు డెలివరీ కోసం సిద్ధం చేసిన అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







