మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!

- December 05, 2025 , by Maagulf
మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ సమ్మిట్ ఫర్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైన్ అక్రాస్ ది లైఫ్‌స్పాన్ 2025 మస్కట్ గవర్నరేట్‌లో ప్రారంభమైంది. సుల్తాన్ కబూస్ యూనివర్సిటీలో అసిస్టెంట్ వైస్-ఛాన్సలర్ హెచ్‌హెచ్ సయ్యిదా డాక్టర్ మోనా ఫహద్ అల్ సైద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో డయాబెటిస్, ఒబెసిటీ మరియు ఎండోక్రినాలజీలకు చెందిన అనేక మంది ప్రొఫెషనల్స్ పాల్గొంటున్నారు.   

ఇది ఒమన్ సుల్తానేట్‌లో మధుమేహం, ఒబెసిటీ మరియు ఎండోక్రైన్ లతో బాధపడుతున్న వారి సంరక్షణకు దోహదపడే కీలకమైన శాస్త్రీయ వేదిక అని ఒమన్ డయాబెటిస్ అసోసియేషన్ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్ సయ్యిదా డాక్టర్ నూర్ బదర్ అల్ బుసైది అన్నారు. డయాబెటిక్ ఫుట్ కేర్, గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాలు, కార్బోహైడ్రేట్ కౌంటింగ్, ఇన్సులిన్ పంప్ థెరపీ వంటి ముఖ్యమైన నైపుణ్యాలను కవర్ చేసే నాలుగు కీలక వర్క్‌ షాప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

 
 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com