ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- December 05, 2025
రియాద్: రియాద్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సౌదీ-ఖతారీ కోఆర్డినేషన్ కౌన్సిల్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి రెండు దేశాల మధ్య సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు, ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ రియాద్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీకి సాదర స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







