యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- December 05, 2025
యూఏఈ: భారతీయ విమానయాన సంస్థ ఇండిగో పలు సర్వీసులను రద్దు చేసింది. ఇండిగో నిర్ణయం యూఏఈ ప్రయాణికులపై అంతగా ప్రభావాన్ని చూపదని ట్రావెల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇండిగో ఎయిర్‌లైన్ అంతర్జాతీయ సర్వీసులలో ప్రభావం స్వల్పంగానే ఉంటుందని స్మార్ట్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ మహమ్మద్ సఫీర్ అన్నారు. తాము ఇండిగో ఎయిర్‌లైన్‌తో టచ్ లో ఉన్నామని,అంతర్జాతీయ సర్వీసులు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని వారు తమకు తెలిపినట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు, షెడ్యూల్ అయిన ఏ సర్వీస్ ఆలస్యం అయిన సందర్భం తమకు ఎదురు కాలేదని ముసాఫిర్.కామ్ COO రహీష్ బాబు స్పష్టం చేశారు.బుధవారం మాత్రం దుబాయ్-కాలికట్ విమానంలో పైలట్ అనారోగ్యానికి గురైనట్లు నివేదించబడిన తర్వాత ఆలస్యం జరిగిందని తెలిపారు.
గత కొన్ని రోజులుగా భారత్ లో దేశీయ విమానాశ్రయాల మధ్య నడిచే అనేక ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్లకు సంబంధించి తీసుకొచ్చిన కొత్త విమాన నిబంధనలే ఇండిగో సర్వీసుల రద్దుకు కారణం అని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.కొత్త నిబంధనల ప్రకారం, పైలట్లకు వారానికి 48 గంటలు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది.పైలట్ వారంలో చేయగలిగే రాత్రి ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకి పరిమితం చేశారు.డ్యూటీ టైడ్ నెస్ గురించి పైలట్ల నుండి అనేక ఫిర్యాదులు అందడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, సమస్య చాలా త్వరగా పరిష్కరించబడుతుందని సాఫ్రాన్ ట్రావెల్స్ అండ్ టూరిజం నుండి ప్రవీణ్ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండిగో గతంలో ఇటువంటి పరిస్థితులను చాలా వేగంగా పరిష్కరించిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







