బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- December 05, 2025
మనామా: బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం ఉందని పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. DANAT ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారణ అయిన సహజ-పెరల్స్ ను మాత్రమే వినియోగంలో ఉన్నాయని షురా కౌన్సిల్‌కు మంత్రిత్వశాఖ తెలిపింది. షురా కౌన్సిల్ సభ్యుడు తలాల్ అల్ మన్నాయ్‌కు ఇచ్చిన వ్రాతపూర్వక సమాధానంలో ఈ మేరకు పేర్కొన్నారు. 2014 డిక్రీ-లా 65 ద్వారా సవరించబడిన ముత్యాలు మరియు విలువైన రాళ్ల నియంత్రణపై 1990 డిక్రీ-లా 10 ప్రకారం స్థానిక మార్కెట్లపై ఇన్స్పెక్టర్ల నిఘా కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జ్యువెల్లరీ షాపులలో సహజ ముత్యాలు మాత్రమే ప్రదర్శన లేదా అమ్మకానికి ఉన్నాయో లేదో నిరంతరం తనిఖీలు జరుగుతాయని వెల్లడించింది. ముత్యాలు మరియు రత్నాల కోసం లైసెన్స్ పొందిన జాతీయ ప్రయోగశాల అయిన బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పెర్ల్స్ అండ్ జెమ్‌స్టోన్స్ (DANAT) నుండి ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉందో లేదో తనిఖీ బృందాలు చెక్ చేస్తాయని స్పష్టం చేశారు. చట్ట పరిధిలో నిర్ధారించిన అన్ని నిబంధనలు, విధానాలను అ ప్రతి సంవత్సరం సమీక్షిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
DANAT సహకారంతో ముత్యాలు మరియు రత్నాల నియంత్రణ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశామని, టెస్టింగ్ మరియు మెట్రాలజీ డైరెక్టరేట్ మరియు తనిఖీ డైరెక్టరేట్ పర్యవేక్షణకు మద్దతుగా రోజువారీ తనిఖీల సమాచారాన్ని షేర్ చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ
- యూఏఈ ప్రయాణికుల పై ఇండిగో రద్దు ప్రభావమెంత?
- ఉమ్మడి సహకారంపై సౌదీ-ఖతార్ చర్చలు..!!
- బహ్రెయిన్ లో కల్చర్డ్ పెరల్స్ పై నిషేధం?
- అరబ్ కప్ ఖతార్ 2025..ఉచిత షటిల్ బస్సు సర్వీస్..!!
- మస్కట్ లో ‘ది లైఫ్‌స్పాన్ 2025’ ప్రారంభం..!!
- సివిల్ ఐడి డేటా ఫోర్జరీ..క్రిమినల్ గ్యాంగ్ అరెస్టు..!!
- పెద్ద పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం
- RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
- క్వాంటం ఎకోసిస్టమ్ నిర్మాణంలో తెలంగాణ!







