ఫ్రాన్స్‌లోని సెయింట్ ఎటెన్నీ రోవరీ చర్చిలో కాల్పులు, ఫాదర్ మృతి
- July 26, 2016
ఫ్రాన్స్‌లోని రోవన్ నగరంలో ఓ చర్చిలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. సాయుధులైన దుండగులు కొద్దిసేపు సెయింట్ ఎటెన్నీ రోవరీ చర్చిలోని వారిని బందీలుగా చేసుకున్నారు. బందీల్లో ఒకరైన చర్చి ఫాదర్‌ను పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించింది. ఇద్దరు దుండగులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చర్చిలోపల కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని ఫ్రెంచ్ టీవీ తెలిపింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలన్, అంతర్గత శాఖ మంత్రి బెర్నాండ్ కేజెనువె ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించనున్నారు. పోలీసులు చర్చి సమీంలోని రోడ్లను పూర్తిగా బ్లాక్ చేశారు. ప్రజలను అటువైపు రావొద్దని సూచించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







