10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- December 06, 2025
యూఏఈ: ఇండియాలోని అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ను కష్టాలు విడవడం లేదు. విమాన సర్వీసుల రద్దుతో దుబాయ్ మరియు ముంబై మధ్య సర్వీసులు ప్రభావితం అయ్యాయి. కొంతమంది ప్రయాణీకులు తక్కువ వెయిటింగ్ తో బయటపడుతుండగా, మరికొందరు 10 గంటలు వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. గురువారం రాత్రి ముంబైకి విమానంలో ప్రయాణించడానికి తన బంధువు ఒకరు దాదాపు 10 గంటలు వెయిటింగ్ చేశాడని దుబాయ్ నివాసి మహమ్మద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ రాత్రి 10 గంటలకు బయలుదేరిందని పేర్కొన్నాడు.
యూఏఈ నుండి బయలుదేరే అనేక ఇతర ఇండిగో విమానాలు శుక్రవారం ఆలస్యంగా నడిచాయి.శుక్రవారం ఉదయం 3:20 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-కోజికోడ్ విమానం చివరికి ఎనిమిది గంటల కంటే ఎక్కువ ఆలస్యంతో ఉదయం 11:29 గంటలకు బయలుదేరింది. ఉదయం 11:45 గంటలకు బయలుదేరాల్సిన కొచ్చి ఇండిగో విమానం 30 నిమిషాల తరువాత మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5:15 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్-అహ్మదాబాద్ విమానం ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళ్లింది. అయితే, విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ప్రభావితం అయిన ప్రయాణికులకు ఇండిగో బహిరంగ క్షమాపణ చెప్పింది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







