బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- December 06, 2025
మనామా: లబ్రేట్ బహ్రెయిన్ 2025తో సమానంగా డైవింగ్ మరియు పెరల్స్ పర్యాటక అనుభవాలను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. 2022–2026 పర్యాటక రంగ వ్యూహంలో కీలకమైన సముద్ర కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు, బహ్రెయిన్ వారసత్వాన్ని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని అథారిటీ లో ప్రాజెక్టుల డిప్యూటీ CEO డానా ఒసామా అల్ సాద్ తెలిపారు. బహ్రెయిన్ సముద్ర వారసత్వాన్ని ఆధునిక పర్యాటకంతో కలపడం ద్వారా డైవింగ్ మరియు పెరల్స్ వేట బహ్రెయిన్ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తుందని అన్నారు.
ఈ అనుభవాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని, పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఇందులో భాగం కావచ్చని పేర్కొన్నారు. పర్యాటక పర్యటనలు సాదా మరియు బు మహర్ నుండి బయలుదేరుతాయని తెలిపారు. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల లైసెన్స్ పొందిన డైవర్ల కోసం పెర్ల్ డైవింగ్ మరియు 16 అంతకంటే ఎక్కువ వయస్సు గల ఈతగాళ్ల కోసం షాలో డైవింగ్ అందుబాటులో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్న్యూస్..
- గల్ఫ్లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్ఫ్లిక్స్ ఆధిపత్యం







