ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!

- December 06, 2025 , by Maagulf
ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!

మస్కట్: ఒమన్ లో స్వచ్ఛంద సేవ చేసేందుకు వాలంటీర్లు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఒమన్ అంతటా సామాజిక సమైక్యత నెలకొన్నది. రాబోయే తరాలకు ఒక నమూనాగా ఇది మారుతుంది. ఒమన్‌లో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఆరోగ్య సంరక్షణ, సమాజ కార్యక్రమాలు, విపత్తు ఉపశమనం మరియు విద్యలో స్వచ్ఛంద సేవ కోసం పెరుగుతున్న పౌరులు తమ సమయాన్ని కేటాయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న జరిగే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవ దినోత్సవం (IVD) ను ఒమన్ ఘనంగా జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త మోనా బింట్ మొహమ్మద్ అల్ ఔఫియా తన అభిప్రాయాలను పంచుకున్నారు.  అమెరికాలోని ఒక మసీదులో చిన్న వయస్సులోనే స్వచ్ఛంద సేవను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు విద్య మరియు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి స్వదేశానికి తిరిగి వచ్చినట్టు తెలిపారు. అల్ ఔఫి ఇప్పుడు 'ఎ లాస్టింగ్ ఇంపాక్ట్' బృందానికి నాయకత్వం వహిస్తుంది. గత 22 సంవత్సరాలకు పైగా ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్‌లో స్వచ్ఛంద సేవకురాలిగా సేవలందిస్తోంది. ప్రతిసారి స్వచ్ఛంద సేవలో పాల్గొనడం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.  

నేటి యువత స్వచ్ఛంద సేవపై ఉన్నతమైన అవగాహనను ప్రదర్శిస్తున్నారని, దానిని ఒక ముఖ్యమైన సామాజిక బాధ్యతగా మరియు స్వీయ-అభివృద్ధికి శక్తివంతమైన అవకాశంగా చూస్తున్నారని అల్ బటాషి అనే సామాజిక కార్యకర్త తెలిపారు.  జాతీయ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సమాజ సేవ సంస్కృతిని బలోపేతం చేస్తాయని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com