బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!

- December 06, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!

మనామా: లబ్రేట్ బహ్రెయిన్ 2025తో సమానంగా డైవింగ్ మరియు పెరల్స్ పర్యాటక అనుభవాలను ప్రారంభించినట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA) ప్రకటించింది. 2022–2026 పర్యాటక రంగ వ్యూహంలో కీలకమైన సముద్ర కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు,  బహ్రెయిన్  వారసత్వాన్ని పునరుద్ధరించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని అథారిటీ లో ప్రాజెక్టుల డిప్యూటీ CEO డానా ఒసామా అల్ సాద్ తెలిపారు. బహ్రెయిన్ సముద్ర వారసత్వాన్ని ఆధునిక పర్యాటకంతో కలపడం ద్వారా  డైవింగ్ మరియు పెరల్స్ వేట బహ్రెయిన్ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తుందని అన్నారు.
ఈ అనుభవాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయని, పౌరులు, నివాసితులు మరియు పర్యాటకులు ఇందులో భాగం కావచ్చని పేర్కొన్నారు. పర్యాటక పర్యటనలు సాదా మరియు బు మహర్ నుండి బయలుదేరుతాయని తెలిపారు. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల లైసెన్స్ పొందిన డైవర్ల కోసం పెర్ల్ డైవింగ్  మరియు 16 అంతకంటే ఎక్కువ వయస్సు గల ఈతగాళ్ల కోసం షాలో డైవింగ్  అందుబాటులో ఉన్నాయని అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com