డొమెస్టిక్‌ వర్కర్స్‌ డ్యూటీ రెగ్యులేషన్‌ చట్టం కోసం

- July 26, 2016 , by Maagulf
డొమెస్టిక్‌ వర్కర్స్‌ డ్యూటీ రెగ్యులేషన్‌ చట్టం కోసం

నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ, డొమెస్టిక్‌ వర్కర్స్‌ యొక్క విధులపై రెగ్యులేషన్‌ కోసం అలాగే డిజేబిలిటీతో బాధపడుతున్నవారి హక్కుల కోసం కొత్త చట్టాల అవసరాన్ని ప్రస్తావించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి యాన్యువల్‌ రిపోర్ట్‌లో ఈ వివరాలు పొందుపరచ్చారు. ప్రస్తతం ఉన్న ఫ్యామిలీ చట్టాన్ని రివ్యూ చేయాలని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. కొన్ని వివాదాల్ని కోర్టు బయటే పరిష్కరించుకునేలా అవకాశం కల్పించాలనీ, దీనికోసం సరైన మెకానిజంను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి అభిప్రాయపడింది. వలసదారుల వేతనాలకు సంబంధించిన వివాదాల్ని పరిష్కరించడం కోసం చట్టాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించాలనీ, అలాగే చట్టాల గురించిన అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి విజ్ఞప్తి చేసింది. వలసదారుల హక్కులు, వారు దేశంలోకి రావడం, వెళ్ళడానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా అవగాహన కల్పిస్తే వివాదాలు తగ్గుతాయని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి అభిప్రాయం తెలిపింది. చట్టాల్ని అమలు చేయడంలో వివిధ శాఖలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సి తన రికమండేషన్స్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com