సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!

- December 08, 2025 , by Maagulf
సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌‌లో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటుగా ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తీకేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఐటీశాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్‌లు కూడా దావోస్ వెళుతున్నారు.

ఈ మేరకు షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.దావోస్‌ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు  అండ్ టీమ్ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com