మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!

- December 08, 2025 , by Maagulf
మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!

మస్కట్: మస్కట్ లో "యువర్ అవేర్ నెస్, యువర్ సేఫ్టీ " అనే నినాదంతో వాతావరణ మరియు సునామీ ప్రమాదాలపై జాతీయ అవగాహన క్యాంపెయిన్ మస్కట్ లో నిర్వహించనున్నారు. ఇది మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా తుఫానులు మరియు సునామీల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి జాతీయ సంసిద్ధతపై అవగాహన కల్పించనున్నారు.

జాతీయ అత్యవసర నిర్వహణ కేంద్రం, పౌర విమానయాన అథారిటీ, సమాచార మంత్రిత్వ శాఖ మరియు పౌర రక్షణ అంబులెన్స్ అథారిటీ నేతృత్వంలో ఈ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సునామీలతో సంబంధం ఉన్న ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంచడం ఈ క్యాంపెయిన్ ప్రాథమిక లక్ష్యమన్నారు.  మస్కట్‌లో జరిగే మూడు రోజుల కార్యక్రమంలో సమావేశాలు, సెమినార్లు నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవగాహన మెటీరియల్ ను పంపిణీ చేయనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com