'ఓం శాంతి శాంతి శాంతిః' నిజాయితీగా చేసిన సినిమా: హీరో తరుణ్ భాస్కర్
- December 08, 2025
ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా తెరపై అలరిస్తున్నారు. 'ఓం శాంతి శాంతి శాంతిః అనే కొత్త ప్రాజెక్ట్‌లో మరోసారి లీడ్‌లో చేస్తున్నారు. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా మద్దతునిస్తున్నాయి, సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ ,నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం షూటింగ్ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ద్వారా ప్రమోషన్లపై మొదలుపెట్టింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్ లో కథ అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఓర్పు, సర్దుబాటును కలిగి ఉన్న మంచి, క్రమశిక్షణ కలిగిన మహిళ కొండవీటి ప్రశాంతిని వివాహం చేసుకుంటాడు. వారి విభిన్న వ్యక్తిత్వాలు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాకి వేదికగా నిలిచాయి, టీజర్ సూచించినట్లుగా, ఈ కుటుంబ కథా చిత్రంలో ఊహించని మలుపు వుంది.
దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దీనిని భిన్నమైన, నవ్వించే మూమెంట్స్ నిండిన ఆరోగ్యకరమైన ఎంటర్టైనర్గా రూపొందించారు. రైటింగ్, కథనం అందరినీ ఆకట్టునేలా వుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యెరగర గోదావరి జిల్లాల అందాన్ని ఆకట్టుకునే, కంటికి ఆహ్లాదకరమైన ఫ్రేమ్‌లతో తీశారు, జే క్రిష్ సంగీతం ముఖ్యంగా ఉల్లాసమైన థీమ్ ట్రాక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు గొప్పగా వున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో తరుణ్ భాస్కర్ తన నటనతో కట్టిపడేశారు. ఐపిఎల్ సంభాషణ తన పాత్రని హైలైట్ చేసే హ్యూమరస్ బిట్‌గా నిలుస్తుంది. ఈషా రెబ్బా తన పాత్రలో ఆకట్టుకుంది. అద్భుతమైన వినోదంతో టీజర్ ప్రామెసింగ్ వుంది. లాంగ్ వీకెండ్ ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్ లో సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. నాకు అలాంటి అవలాశం ఇచ్చిన నిర్మాత సృజన్, డైరెక్టర్ సజీవ్ కి టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాలో బ్రహ్మాజీ గారికి చాలా మంచి పేరు వస్తుంది. ఆయన వచ్చినప్పుడు విజిల్ కొడతారు. చాలామందికి ఇది రీమేక్ కదా మళ్లీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. దానికి రీజన్ చెబుతా.. విజయ్ సుపెరుం పౌర్ణమియుం మలయాళం లో వంద రోజులు ఆడిన సినిమా. మలయాళం ప్రేక్షకులు సినిమాని చాలా ఆదరించారు. అది పెళ్లిచూపులు రీమేక్. గోదారి యాస, కల్చర్ కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా రీసెంట్ టైంలో ఓం శాంతి అవుతుంది. అది గ్యారెంటీగా చెప్తున్నాను. ఓం శాంతి లో కూడా మీకు నిజాయితీ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ చేయాలనే ప్యాషన్ తో చేశాను. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసినప్పుడు అది మీకు అర్థమవుతుంది.
హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సృజన్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. తను చాలా మంచి సినిమాలు చేసే నిర్మాత. ఫస్ట్ టైం మేము కలిసి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తరుణ్ భాస్కర్ తో నటించే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంద. ఆయన డైరెక్షన్లో కూడా నటించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను. సజీవ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. సృజన్ నిర్మాతగా నాకు చాలా ఇష్టం. చాలా మంచి సినిమాలో చేశాడు. ఈ సినిమా నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ వేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ తో ఈ సినిమా చేయడం మరింత ఆనందం ఇచ్చింది.ఈస్ట్ గోదావరి యాస నాకంటే బాగా మాట్లాడాడు. తను హీరో డైరెక్టర్ గా లైఫ్ లాంగ్ ఉంటాడు. ఈసా టాలెంటెడ్ హీరోయిన్. జనవరి 23న సినిమా వస్తుంది. తప్పకుండా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది
ప్రొడ్యూసర్స్ సృజన్ మాట్లాడుతూ... 35 సక్సెస్ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయమేసింది. ఇది రీమేక్ అని అందరికీ తెలుసు. దీన్ని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అని ఆలోచించాం. ఈ సినిమాని చూస్తున్నప్పుడు అసలు ఇది రీమేక్ అని గుర్తు రాకూడదు. దానికోసం ఎలా చేయాలో అది అచీవ్ చేసామని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు చాలా సర్ప్రైజ్ అవుతారు. చాలా మంచి ఫ్యామిలీ ఫిలిం. 35 కి ఎలాంటి ప్రశంసలు వచ్చాయో ఈ సినిమా కూడా అలాంటి ప్రశంసలు వస్తే నమ్మకం ఉంది.
డైరెక్టర్ సజీవ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇలా వేదికపై మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్.నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సృజన్ గారికి చాలా థాంక్యూ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నందుతోనే ఉన్నాను. ఎప్పటికీ తనతోనే ఉంటాను. నేను ఇక్కడ ఉండడానికి తనే కారణం. సృజన్ గారిని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. తరుణ్ గారు నన్ను నమ్మారు. అది నాకు చాలా పెద్ద విషయం. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. నన్ను ఒక డబ్ల్యూ డైరెక్టుగా నమ్మడం చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డైలాగ్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. ఇందులో డైలాగ్స్ డైరెక్టర్ సజీవ్ కోసమే రాశాను .35 సినిమాకి నాకంటే ఎక్కువ వాడే కష్టపడ్డాడు. 35 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు రాయడం మొదలు పెట్టాం. చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ ఇది. తరుణ్ ని ఇప్పటివరకు తెలంగాణలో యాసలో మనం చూసాం. ఇప్పుడు కంప్లీట్ గా గోదావరి యాసలో కి తీసుకెళ్లాం. అది స్క్రీన్ కి చాలా కొత్తగా ఉంటుంది. టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. జనవరి 23న అందరు సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - ఎ ఆర్ సజీవ్
నిర్మాతలు - సృజన్ యరబోలు, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
బ్యానర్- S ఒరిజినల్స్ & మూవీ వెర్స్ స్టూడియోస్
సహ నిర్మాతలు: కిషోర్ జాలాది, బాల సౌమిత్రి
సంగీతం - జై క్రిష్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - దీపక్ యెరగరా
డైలాగ్స్ - నంద కిషోర్ ఈమాని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -భువన్ సాలూరు
లైన్ ప్రొడ్యూసర్ - శ్రీనివాసరావు ఈర్ల
PRO - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







