‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

- December 08, 2025 , by Maagulf
‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

న్యూ ఢిల్లీ: ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవ సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ జాతీయ గీతాలలో ఒకటైన ‘వందే మాతరం’ అంశాన్ని 1975లో విధించిన ఎమర్జెన్సీకి, కాంగ్రెస్ పార్టీ అప్పటి రాజకీయ నిర్ణయాలకు అనుసంధానించారు.

మొహమ్మద్ అలీ జిన్నా ‘వందే మాతరం’కు వ్యతిరేకించారని, ఆ భావనలతోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ పాట కొందరు ముస్లింలను కలవరపెట్టవచ్చని భావించి కాంగ్రెస్ పార్టీ దానిని పూర్తిగా స్వీకరించలేదని ఆయన అన్నారు.

‘వందే మాతరం’ 100వ వార్షికోత్సవం జరుపుకున్న సమయంలో దేశం ఎమర్జెన్సీలో చిక్కుకుందని, రాజ్యాంగం నలిగిపోయిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రస్తుతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పాట గౌరవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1947లో స్వాతంత్ర్య సాధనకు ఈ గీతం ఎలా ప్రేరణగా నిలిచిందో ఆయన వివరించారు.

1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వివాదానికి (Modi on Vande Mataram) కేంద్రబిందువైంది. ఆ సమయంలో జాతీయ సమావేశాల్లో ‘వందే మాతరం’లోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని నిర్ణయించామని, మిగతా చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం కొందరికి అభ్యంతరకరంగా మారిందని కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది.

బీజేపీ మాత్రం ఈ నిర్ణయం దేశ విభజనకు విత్తనాలు వేసిందని విమర్శిస్తోంది. ‘వందే మాతరం’లోని కొన్ని భాగాలను తొలగించడం జాతీయ ఐక్యతకు భంగం కలిగించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యువత ఈ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో గతంలో రాసిన నెహ్రూ లేఖలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘వందే మాతరం’లోని పదాలను దేవతలుగా భావించడం అప్రాసంగికమని నెహ్రూ అభిప్రాయపడ్డారని, అయితే ఆ పాట మొత్తం హానిలేనిదేనని ఆయన స్పష్టం చేసిన లేఖలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com