సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కు గాయాలు…!

- December 08, 2025 , by Maagulf
సినిమా షూటింగ్ లో రాజశేఖర్ కు గాయాలు…!

తన కొత్త సినిమా షూటింగ్ లో హీరో రాజశేఖర్ కు గాయాలయ్యాయి. నవంబర్ 25న ఈ ఘటన జరిగింది. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తుండగా ఆయన కాలికి గాయాలయ్యాయి.

రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయినట్లు సమాచారం. మడమ దగ్గర గాయమైనట్లు తెలిసింది. వెంటనే యూనిట్ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రాజశేఖర్ కు సర్జరీ చేయాల్సి వచ్చింది. సుమారు 3 గంటల పాటు సర్జరీ జరిగిందని తెలుస్తోంది.

బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి 3 గంటలు పట్టిందని సమాచారం. సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్, వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.

సర్జరీ తర్వాత 3 నుంచి 4 వారాల పాటు తప్పనిసరిగా రెస్ట్ తీసుకోవాలని రాజశేఖర్ కు డాక్టర్లు తేల్చి చెప్పారు. ముఖ్యంగా గాయమైన కాలిని ఎట్టి పరిస్థితుల్లోనూ కడపకూడదని చెప్పారు. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు ఆయన షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారు.

రాజశేఖర్ గాయాలపాలవడం ఇది తొలిసారి కాదు. నవంబర్ 15, 1989లో మగాడు షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైంది. 36 ఏళ్ల తర్వాత నవంబర్ లో మళ్ళీ ఆయనకు గాయమైంది. అయితే, గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు రాజశేఖర్. రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘బైకర్’. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com