మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- December 10, 2025
మనామా: బహ్రెయిన్ తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, కొన్ని ప్రదేశాలు దేశ ఆత్మను మనమా సౌక్ లా స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. దాని ఎరుపు-తెలుపు జెండాల క్రింద, బంగారు దుకాణాల మెరుపు మధ్య, సౌక్ ఒక మార్కెట్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. సౌక్ తరతరాలుగా బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఔడ్ బ్లెండర్లు మరియు సుగంధ ద్రవ్యాల విక్రేతలు, ట్రెండీ కేఫ్‌లు మరియు బోటిక్ కాన్సెప్ట్ స్టోర్‌లకు నిలయంగా ఉంది. పర్యాటకులు తప్పకుండా పర్యటించే టూరిస్టు స్పాట్ లలో సౌక్ ఒక డెస్టినేషన్ గా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇక్కడ అనేక సంవత్సరాలుగా వ్యాపారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. మూడు తరాలుగా నిర్వహించే అనేక దుకాణాలు ఇక్కడ చూడవచ్చని అధికారులు తెలిపారు. సౌక్‌కు ప్రవేశ ద్వారం అయిన బాబ్ అల్ బహ్రెయిన్ సుగంధ ద్రవ్యాలకు కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ వాటిని కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుంటారు. అందుకే సౌక్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా తన ఉనికిని చాటుకుంటూనే ఉందని టూరిజం మినిస్ట్రీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







