దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!

- December 10, 2025 , by Maagulf
దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!

దోహా: ఖతార్ జాతీయ దినోత్సవం (QND) వేడుకలో భాగంగా రం దర్బ్ అల్ సయ్ లో కార్యకలాపాలను ప్రారంభించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ కార్యక్రమంలో ఖతార్ గుర్తింపు మరియు విలువలను ప్రతిబింబించే సమగ్ర సాంస్కృతిక, వారసత్వ అనుభవాలను కలిగి ఉంటాయని తెలిపింది.ఉమ్ సలాల్‌లోని దర్బ్ అల్  సయ్  సైట్‌లో 150,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొంది.  

ఫాల్కన్రీ హౌస్, హంటింగ్ హౌస్, సాదు మరియు స్పిన్నింగ్ హౌస్ వంటి సాంప్రదాయ గృహాలు కూడా ఉంటాయని తెలిపింది. వీటితో పాటు ఒంటెల స్వారీ లెసన్స్,  వారి పూర్వీకుల సంచార జీవితాన్ని ప్రతిబింబించే ప్రత్యక్ష అనుభవాలను కూడా తెలుసుకోవచ్చని పేర్కొంది.అల్ బిద్దా ఈవెంట్ ద్వారా దర్బ్ అల్ సయ్ సాంప్రదాయ సముద్ర వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని, వారసత్వ ఆటలు మరియు పోటీలతో పాటు, ఖతారీ సముద్ర వారసత్వాన్ని తెలిపే మ్యూజియం కూడా ఉందని వెల్లడించింది.దర్బ్ అల్ సాయి ప్రతిరోజూ మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 11:00 గంటల వరకు ప్రజలకు ఆహ్వానం పలుకుతుందని ఖతార్ వాలంటీర్ సెంటర్ డైరెక్టర్ ముయిద్ జబ్రాన్ అల్ ఖహ్తానీ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com