యూఏఈలో 17 కిలోల కొకైన్‌ సీజ్..!!

- December 11, 2025 , by Maagulf
యూఏఈలో 17 కిలోల కొకైన్‌ సీజ్..!!

యూఏఈ: అంతర్జాతీయ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను యూఏఈ గుట్టురట్టు చేసింది. 17 కిలోల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా ముఠాను షార్జా పోలీసులు పట్టుకున్నారు.

ఇద్దరు నిందితులు 12 కిలోల కంటే ఎక్కువ కొకైన్‌ను యూఏఈలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. షార్జా పోర్ట్‌లు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్స్ అథారిటీ వారి కదలికలను ట్రాక్ చేసింది. ఓ గల్ఫ్ దేశం ద్వారా యూఏఈలోకి చేరుకున్న ప్రధాన స్మగ్లర్, ఆసియా జాతీయుడిని అరెస్టు చేశారని మాదకద్రవ్య నివారణ మరియు నియంత్రణ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ సుల్తాన్ అల్ అసెం తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు యూఏఈలో డ్రగ్స్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులను కూడా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

రెండు గంటల్లోపు, నేషనల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమానితుడి సమాచారాన్ని మరియు మాదకద్రవ్యాలను దాచడానికి ఉపయోగించే పద్ధతిని వాళ్ల దేశానికి చేరవేసింది. వారు దాదాపు 5 కిలోల కొకైన్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే రెండు డ్రగ్ కార్యకలాపాలను భగ్నం చేయడం ఎమిరేట్ భద్రతా వ్యవస్థ సామర్థ్యాన్ని, సంబంధిత అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమన్వయాన్ని మరియు మాదకద్రవ్యాల హాని నుండి సమాజాన్ని రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రదర్శిందని షార్జా పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com